Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దెయ్యాలన్నా, దెయ్యాల సినిమాలన్నా చాలా మంది భయపడుతుంటారు. కాని నాకు ఆ భయం లేదు. వీలుంటే వాటితో డేటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాను' అని అంటోంది త్రిష. ఇప్పటివరకు రొమాంటిక్ పాత్రలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న త్రిషకు దెయ్యాలన్నా, దెయ్యాల సినిమాలన్నా చాలా ఇష్టమట. యాక్షన్ చిత్రాల కంటే హర్రర్ చిత్రాల్లో నటించడానికే మక్కువ చూపిస్తుందట. ఎప్పట్నుంచో హర్రర్ చిత్రాల్లో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తోందట. అందుకే తాజాగా నటిస్తున్న 'మోహిని', 'గర్జనై', 'శతురంగవెట్టై 2', '1818', 'హే జ్యూడ్', '96' వంటి తదితర ఆరు చిత్రాల్లో మూడు చిత్రాలు హర్రర్ జోనర్ సినిమాలట. వీటిల్లో 'మోహిని' చిత్రం గురించి త్రిష మాట్లాడుతూ,'ఈ సినిమా మొత్తం దెయ్యం చుట్టూనే తిరుగుతుంది. దేవుడు ఉన్నాడని నమ్మితే దెయ్యం కూడా ఉందని నమ్మాల్సిందే. అయితే దేవుడు, దెయ్యం కంటే ఏదో ఒక అతీతమైన శక్తి ఉందని నమ్ముతాను. అదే మనల్ని నడిపిస్తుందని భావిస్తాను.
చాలా మంది దెయ్యాల్ని చూసి మేం భయపడ్డామని చెబుతారు. కాని నాకు అలా ఏమీ ఉండదు.
వీలుంటే వాటితో డేటింగ్ చేసేందుకు కూడా రెడీగా ఉన్నాను' అని చెప్పింది.