Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులుగా వి.ఎస్.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కుటుంబ కథా చిత్రం'. దాసరి భాస్కర్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో హీరో నందు, కమల్ కామరాజు, కత్తి మహేష్ విడుదల చేయగా, టీజర్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ,'టీజర్, మోషన్ పోస్టర్లు ఏ విధంగా అలరించాయో అదే విధంగా ట్రైలర్, సినిమా కూడా ఉంటుంది. మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది' అని చెప్పారు. 'గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు అవి పరిమిత కుటుంబాలుగా మారిపోయాయి. ప్రేమతో గొడవపడే ఓ ఫ్యామిలీకి ఆ ఇంటి సెక్యూరిటీనే రాబంధులుగా మారితే ఆ పరిణామం ఎలా ఉంటుందో తెలిపేదే మా చిత్రం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని దర్శకుడు అన్నారు. 'డిఫరెంట్ కాన్సెప్ట్, ఫ్రెష్ స్క్రీన్‌ప్లే ఉండే చిత్రమిది' అని హీరో నందు తెలిపారు. కమల్‌కామరాజు మాట్లాడుతూ,'గతంలో నటించిన చిత్రాలతో పోలిస్తే ఇదొక పూర్తి వైవిధ్యమైన చిత్రం. ఇందులో నా పాత్ర పాటిజివ్‌గా ఉంటుందా లేక నెగటివ్‌గా ఉంటుందా అనేది సినిమా చివర్లో తెలుస్తుంది' అని చెప్పారు.