Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు యాక్సిడెంట్ అయ్యిందని ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 23వ కోల్‌కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం కోసం కోల్‌కతా వెళ్ళిన అమితాబ్ కారు వెనుక చక్రం ఊడిపోయి ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో అమితాబ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని, వెనుకే వస్తున్న ఓ మంత్రి వాహనంలోకి ఎక్కి సురక్షితంగా ప్రయాణించినట్టు తెలిసింది. తాజాగా దీనిపై అమితాబ్ స్పందిం చారు. 'కోల్‌కతాలో నేను కారు ప్రమాదం నుంచి బయటపడినట్టు వస్తోన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అసలు నాకు యాక్సిడెంటే కాలేదు' అని బిగ్ బీ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ '102 నాటౌట్', 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్', 'బ్రహ్మాస్త్రా' చిత్రాల్లో నటిస్తున్నారు.