Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండుగలు, ప్రత్యేక రోజుల్లో తమ సినిమాలకు సంబంధించిన టైటిల్స్, ఫస్ట్‌లుక్‌లు, టీజర్, ట్రైలర్లు విడుదల చేయడం ఏ చిత్ర పరిశ్రమలోనైనా సర్వ సాధారణమే. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇప్పుడు అభిమానుల కు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని సర్ప్రైజ్నివ్వబోతున్నాడు. షారూఖ్ ప్రస్తుతం ఆనంద్ ఎల్.రారు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన మరుగుజ్జుగా కనిపించనున్నారు. కత్రినా కైఫ్, అనుష్క శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా టైటిల్‌ను కన్ఫమ్ చేసి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలని షారూఖ్‌తోపాటు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందట. సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు.