Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమజ, మానస, అజరు ప్రధాన పాత్రధారులుగా కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో లాగిన్ మీడియా పతాకంపై వై.ఉదరు భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం 'హెచ్‌బిడి'(హ్యాకెడ్ బై డెవిల్). సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కృష్ణ కార్తీక్ మాట్లాడుతూ, 'నాకిది మొదటి చిత్రం. తొలి సినిమానే ప్రయోగాత్మకంగా ఉండాలని నిర్మాత కోరడంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. పక్కా థ్రిల్లర్ చిత్రమిది. ప్రేక్షకులను భయపెట్టడానికి మాత్రమే చేశా. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సినిమా సెన్సార్ వరకు రావడం ఆనందంగా ఉంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్‌ను పొందింది. మొదటగా సెన్సార్ సభ్యులు 25కట్స్ చెప్పారు. మేం క్లారిటీ ఇవ్వడంతో చెప్పిన అంశానికి అగ్రీ అయి 5 కట్స్‌కు కుదించారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఇటీవల విడుదలైన చిత్ర పాటలకు, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. నా రెండవ సినిమా కూడా ఇదే బ్యానర్లో త్వరలోనే ప్రారంభం కానుంది' అని అన్నారు. 'చిన్న సినిమాలు తీయడం మానేస్తే సినీ పరిశ్రమ చిన్నదిగా అయిపోతుంది. మాలాంటి చిన్న సినిమాలను ప్రోత్సహించాలి. ఈ నెల 25న మా బ్యానర్లోనే మరో చిత్రాన్ని ప్రారంభించనున్నాం' అని నిర్మాత ఉదరు భాస్కర్ తెలిపారు.