Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టార్ హీరోలతో నటించేందుకు ఏ కథానాయికైనా ఆసక్తి చూపిస్తుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర కథానాయకుడితో అంటే మరో మాట లేకుండానే ఓకే చెబుతారు. తాజాగా అగ్ర కథానాయికగా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సైతం పవన్‌తో నటించాలనుందని తెలిపింది. అంతే కాదు విజరు దేవరకొండతోనూ నటించాలనుందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సోషల్ మీడియాలో అభిమానులతో కాసేపు చాటింగ్ చేసిన రకుల్.. పవన్‌తో ఎప్పుడు నటిస్తారని ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, 'నాకు టాలీవుడ్లో పవన్ కళ్యాణ్‌తో నటించడమంటే ఇష్టం. అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను. మీరే(అభిమానులు) డైరెక్ట్‌గా పవన్‌ని అడగండి. సినిమా చేయమని. ఆయన ఓకే అంటే నేను రెడీగా ఉన్నా. అలాగే నాకు విజరు దేవరకొండతో కూడా చేయాలనుంది' అని తెలిపింది. రకుల్ ప్రస్తుతం 'అయారి' అనే హిందీ చిత్రంలో నటిస్తుంది.