Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్, సమంత జంటగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న నూతన చిత్రానికి 'అభిమన్యుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత హరి గుజ్జలపూడి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 18న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ, 'ఇంతకుముందు నేను చేసిన అన్ని సినిమాలకంటే హై రేంజ్లోఉండే సినిమా ఇది. హీరోగా, నిర్మాతగా నాకు బాగా నచ్చిన సినిమా. డెఫినెట్‌గా రాబోయే సంక్రాంతికి నాకు మరో పెద్ద హిట్ సినిమా అవుతుంది. సబ్జెక్ట్‌ని దర్శకుడు మిత్రన్ చాలా బాగా డీల్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో లావిష్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అని చెప్పారు. 'షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నేడు(శనివారం) ఉదయం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సాయంత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తాం. డిసెంబర్ 27న ఈ చిత్ర ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశార. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం. విశాల్ కెరీర్లోనే హై బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న సినిమా ఇది' అని నిర్మాత హరి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్.