Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, మనీషా రాజ్ జంటగా మహా లక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం '2 కంట్రీస్'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ,'ఇటీవల విడుదల చేసిన టైటిల్ లోగోకు మంచి స్పందన లభించింది. అదే ఉత్సాహంతో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశాం. ఈనెల 24న టీజర్‌ను విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. భారీ బడ్జెట్‌తో, ఉత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరో సునీల్‌కు ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందిస్తుంది. నా గత చిత్రాలు 'జై బోలో తెలంగాణ', 'శ్రీ రాములయ్య', 'భద్రాచలం', 'జయం మనదేరా' వంటి చిత్రాల మాదిరిగానే మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. ఈ చిత్ర షూటింగ్‌ను మన దేశంతోపాటు అమెరికాలోనూ ఎక్కువ శాతం చేశాం. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈచిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది' అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి, షాయాజీ షిండే, దేవ్‌గిల్, కృష్ణభగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సితార, రాజా రవీంద్ర, షిజు, సంజన, శివారెడ్డి, ప్రవీణ, హర్షిత, శేషు, చమ్మక్‌చంద్ర, రచ్చరవి, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపీసుందర్, కెమెరా : సి.రాంప్రసాద్, మాటలు : శ్రీధర్ సిపాన.