Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్‌ను రామ్‌చరణ్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డా|| రవికిరణ్ మాట్లాడుతూ ''మా చిత్రం ట్రైలర్‌ను రామ్‌చరణ్‌గారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. బిజినెస్ పరంగా కూడా మంచి క్రేజ్ వచ్చింది. మా బ్యానర్లో నిర్మించిన తొలి సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సూపర్‌హిట్ అయింది. దాన్ని మించిన విజయం సాధించేలా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటిస్తాం' అని అన్నారు. 'హీరోగా నేను నటించిన మొదటి చిత్రం ఆడియో ఫంక్షన్‌కి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌గారు విచ్చేసి నన్ను ఆశీర్వదించారు. ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు 'సప్తగిరి ఎల్ఎల్బి' ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌గారు అంగీకరించడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ అభిమానిని అవ్వడం నా అదృష్టం. మెగా ఫ్యామిలీ నాకు అందిస్తున్న సహకారానికి జీవితాంతం రుణపడి ఉంటాను. మంచి సబ్జెక్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది' హీరో సప్తగిరి చెప్పారు.