Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గత నాలుగేండ్లుగా వరుసగా రెస్ట్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇకపై స్పీడు తగ్గించి విశ్రాంతి తీసుకుంటాను' అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది 'విన్నర్', 'రారండోరు వేడుక చూద్దాం', 'జయ జానకి నాయక', 'స్పైడర్' వంటి తదితర చిత్రాలతో రకుల్ ప్రేక్షకులను అలరించింది. తాజాగా నటించిన 'ఖాకి' చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.
ఈ నేపథ్యంలో శనివారం మీడియాతో రకుల్ పంచుకున్న విశేషాల సమాహారం..
రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా 2005లో జరిగిన ఓ రియల్ ఇన్స్‌డెంట్ ఆధారంగా 'ఖాకి' చిత్రం రూపొందింది. శుక్రవారం విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.
తెలుగుతోపాటు తమిళంలోనూ రెస్పాన్స్ చాలా బాగుంది.
కథలో నా పాత్ర హౌస్ వైఫ్ అని చెప్పినప్పుడు 'భార్యగా నేనెందుకు నటించాలి' అని దర్శకుడిని ప్రశ్నించాను. అయితే ఆయన కథతోపాటు నా పాత్రను నెరేట్ చేసిన విధానానికి కన్వీన్స్ అయ్యాను. కొత్తగా పెళ్లైన జంట ప్రేమ సన్నివేశాలు క్యూట్‌గా ఉండటంతో ఈ పాత్ర చేసేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చాను. పాత్ర పరంగా సంతృప్తిగా ఉన్నాను.
కార్తీతో పనిచేయడం హ్యాపీగా ఫీలవుతున్నాను. ఆయన చాలా ప్యాషనేట్, హార్డ్‌వర్కర్. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ రాణిస్తున్నారు. ఈ సినిమా చేసినంత మాత్రాన పోలీసులపై నా అభిప్రాయం మారదు. ఎందుకంటే మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ కావడంతో అంతకుముందే ఆ పరిస్థితులను చూశాను. నాన్నతోపాటు నాలుగైదు రోజులు బార్డర్లో ఉన్నా. గన్‌ఫైరింగ్ వంటివన్నీ చూశాను.
ప్రస్తుతం హిందీలో 'అయారి' చిత్రంలో నటిస్తున్నాను. నీరజ్ పాండే వంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇది వార్ బేస్డ్ చిత్రం. దీంతోపాటు తమిళంలో కార్తీతోనే మరో సినిమా చేస్తున్నా. యంగేజ్ లవ్ స్టోరీతో రూపొందబోయే ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. సూర్య, మహేష్‌బాబు చిత్రాలకు సంబంధించి కథాచర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ అయ్యాక చెబుతాను.
నన్ను ఇప్పుడంతా 'నెం.1' హీరోయిన్ అంటున్నారు. అదంతా నా అదృష్టం. అయితే నేను నెం.1 స్థానంలో ఉన్నానని, అగ్ర కథానాయికను అనే ఫీలింగ్ నాలో లేదు. వాటిని పట్టించుకోను. నాకు వచ్చిన అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తున్నాను. బిజీలో కూడా సినిమాలు చేస్తున్నానంటే కేవలం నా గట్సే కారణం. స్క్రిప్ట్ నచ్చకపోతే సినిమా చేయను. నచ్చితే డేట్స్ కుదరకపోయినా డే అండ్ నైట్ మేనేజ్ చేసుకుంటూ నటిస్తున్నాను. గత నాలుగేండ్లుగా వరుసగా సినిమాలు చేశాను. ఇకపై కాస్త స్పీడు తగ్గించాలనుకుంటున్నాను.
పరిశ్రమలో మహిళల లైంగిక వేధింపుల గురించి సినిమాల్లోకి రాకముందు నేను కూడా చాలా విన్నాను.
కానీ ఇక్కడికి వచ్చాక అలాంటిదేమీ కనిపించలేదు. ఇతరుల విషయం నాకు తెలియదు. కానీ నా వరకు అలాంటి పరిస్థితి ఎదురు కానందుకు హ్యాపీగా ఫీలవుతున్నా. ఇక బయటి మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిందితులపై కఠినమైన శిక్షలు వేయాలి. దాన్ని కంట్రోల్ చేయడమనేది సీరియస్‌గా తీసుకుంటేనే అలా చేయాలనుకునే వారిలో మార్పు వస్తుంది. సీరియస్‌గా ఇంప్లిమెంటేషన్ చేయనంత వరకు ఏం మాట్లాడినా,ఏం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.