Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ రవి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'నెపోలియన్'. ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కాన్సెప్ట్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు ఆనంద్ రవి మాట్లాడుతూ, 'మంచి టీమ్ కలిసి చేసిన చిత్రమిది. చిన్న సినిమాగా మొదలై పెద్ద రేంజ్లో నిలబడింది. నీడపోయిందని రిపోర్ట్ ఇచ్చే కామన్ మ్యాన్ కథే ఈ చిత్రం. ఆడియెన్స్‌ను ఎగ్జైట్మెంట్కు గురి చేస్తుంది. ఈ శుక్రవారం విడుదలవుతున్న చిత్రాల్లో మా సినిమాకు మంచి క్రేజ్ ఉంది. అన్ని వర్గాలకు నచ్చుతుందని ఆశిస్తున్నా. సినిమా విడుదలకు సహకరిస్తున్న బన్నీవాసుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు' అని అన్నారు. 'కొత్త కాన్సెప్ట్‌తో చేసిన చిత్రమిది. కొత్త టీమ్ పనిచేసింది. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. గీతా ఆర్ట్స్ వారు మా సినిమా రిలీజ్‌కు సపోర్ట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. యు.ఎస్, యు.కెలో కూడా విడుదల చేస్తున్నాం. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని నిర్మాత భోగేంద్ర గుప్త తెలిపారు. కోమల చెబుతూ, 'సినిమాపై ఆసక్తితో డాక్టర్ ప్రాక్టీస్ కూడా మానేశాను. ఒకప్పుడు నాకు నచ్చిన సినిమాలే చూసేదాన్ని. కానీ 'నెపోలియన్' నా అభిప్రాయాన్ని మార్చేసింది. ప్రతి సినిమాకు పడే కష్టం అర్థమైంది. విభిన్నమైన కథాంశంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఖాయం' అని అన్నారు. 'ఇందులో మంచి పాత్ర పోషిస్తున్నాను. నా కెరీర్లో ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది' అని రవివర్మ తెలిపారు. 'విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. తెరపై విజువల్గానూ పాటలు ఆకట్టుకుంటాయి' అని సంగీత దర్శకుడు సిద్ధార్థ్ అన్నారు.