Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఐ ఫోన్‌తో తీసిన 'లవర్స్‌క్లబ్' వంటి వినూత్న చిత్రానికి తెలుగు చిత్ర పరిశ్రమ సపోర్ట్ చాలా అవసరం' అని రైటర్ చిన్నికృష్ణ అన్నారు. అనిష్ చంద్ర, పావని, ఆర్యన్, పూర్ణి ప్రధాన పాత్రధారులుగా ధృవశేఖర్ దర్శకత్వంలో భరత్ అవ్వారి నిర్మించిన చిత్రం 'లవర్స్ క్లబ్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతోపాటు పాజిటివ్ టాక్ వస్తోంది. బుధవారం సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన రైటర్ చిన్నికృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 'ఎంతో మంది ఎన్నో విధాలుగా చిత్రాలు తీశారు. కానీ మొదటిసారి ఐ ఫోన్‌తో సినిమా తీయడమేంటని ఆశ్చర్యపోయాను. ఇప్పుడు సినిమా చూశాక క్వాలిటీ చాలా బాగుందనిపించింది. ఎక్కడా ఇబ్బంది కలగలేదు. అనుకున్నది అనుకున్నట్టుగా డిజిటల్ కెమెరాకి ఏమాత్రం తీసిపోకుండా దానికంటే బాగా మంచి ఫ్రేమ్స్ పెట్టి సినిమాను చాలా బాగా తీశారు. ఇలాంటి చిత్రాన్ని తీసిన దర్శకుడి ధైర్యానికి సినీ పెద్దల సహకారం అవసరం. అందులో భాగంగానే నేను వచ్చా' అని అన్నారు.