Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇది నా జీవితంలో మరచిపోలేని రోజు.. మెగాస్టార్ చిరంజీవి మెగా సర్ప్రైజ్తో నన్ను మెస్మరైజ్ చేశారు. నా లైఫ్‌లో బెస్ట్ గిఫ్ట్ ఇదే..' అంటూ రారు లక్ష్మి అమితానందాన్ని వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లోకి అడుగిడుతూ రారు లక్ష్మి నటించిన 'జూలీ 2' చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిరంజీవి వీడియో క్లిప్ రూపంలో రారుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ''జూలీ 2' ద్వారా రారు లక్ష్మీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. కెరీర్లో 50వ సినిమాగా చేస్తున్న 'జూలీ 2' ఆమెకు చాలా ప్రత్యేకం. భిన్న భాషల్లో రారు నటించడం చాలా సంతోషంగా ఉంది' అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూనే కొసమెరుపుగా ఫ్లైయింగ్ కిస్‌తో చిరు మరోమారు విషెస్ తెలియజేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చిరు పంపిన వీడియో క్లిప్‌ను 'రత్తాలు'ను చిరు సర్ప్రైజ్ చేశారంటూ సామాజిక మాధ్యమం ద్వారా రారు అభిమానులతో షేర్ చేసుకున్నారు. చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రంలో 'రత్తాలు.. రత్తాలు' అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్ సరసన రారు మెరిసింది.