Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ కథానాయకుడి సత్తా ఏంటో తెలియాలంటే ఆయనకు దీటుగా ప్రతినాయకుడు ఉండి తీరాల్సిందే. ఈ సూత్రాన్ని బాగా వంటబట్టించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తన తాజా చిత్రం కోసం బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరారును విలన్‌గా ఎంపిక చేశారట. రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన విషయం విదితమే. జనవరిలో ఈచిత్రానికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా విలన్‌గా వివేక్ ఒబెరారును ఎంపిక చేశారట. రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన 'రక్తచరిత్ర' చిత్రంతో వివేక్ ఒబెరారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించే ఈచిత్రంలోని ఓ ముఖ్యపాత్రలో రమ్యకృష్ణ కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన మరోసారి రకుల్‌ప్రీత్ సింగ్ మెరిసే అవకాశం కూడా ఉందట.