Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో 'మిడ్నైట్ చిల్డ్రన్' అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన పాత్ర తరహాలోనే శ్రియా మరోసారి నటించనుంది. నూతన దర్శకురాలు సుజన దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో సిటీ స్లమ్‌లో పెరిగిన సాధారణ వర్కింగ్ ఉమెన్‌గా శ్రియా కనిపించబోతోంది. ఓ ఇన్నోసెంట్ గర్ల్ జీవిత ప్రయాణాన్ని తెలిపే చిత్రమిది. ఇన్నోసెంట్ గర్ల్‌గా శ్రియా కనిపించనుంది. గతంలో ఎప్పుడూ కనిపించని పాత్రలో శ్రియా మెస్మరైజ్ చేయనుందట. మహిళా ప్రధానంగా సాగే ఈ సినిమాకు సుజన దర్శకత్వం వహిస్తున్నారు. సుజనకిది డైరెక్టర్‌గా తొలి చిత్రం. ఇక ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చనుండటం విశేషం. సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందిస్తున్నారు. 'కథ పూర్తయ్యింది. సినిమాకు సంబంధించిన డిజైన్స్ కూడా పూర్తయ్యాయి. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని మార్చి ఫస్ట్ వీక్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని దర్శకురాలు సుజన తెలిపారు. శ్రియా ప్రస్తుతం 'గాయత్రి', 'నరకాసూరన్', 'తడ్కా', 'వీరభోగ వసంత రాయలు' వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.