Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్‌బాబు, సంజన, అమృత హీరో హీరోయిన్లుగా శ్రీమతి రమాదేవి సమర్పణలో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై 'షాలిని' ఫేమ్ షెరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అనగనగా ఓ రాజకుమారుడు'. పి.వి.రాఘవులు నిర్మాత. హాస్యనటుడు సుమన్‌శెట్టి ప్రధాన పాత్రధారుడిగా నటిస్తున్న ఈచిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్ ఇటీవల గోవాలో పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు ఈచిత్రం గురించి మాట్లాడుతూ,'లవ్, కామెడీ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. గోవా, మహారాష్ట్రలోని కొన్ని అందమైన ప్రదేశాల్లో జరిపిన చిత్రీకరణతో తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. గోవా నేపథ్యంలో సాగే సరికొత్త పాయింట్‌తో రూపొందుతున్న ఈ చిత్రకథకు తగ్గట్టు నాయకానాయికలు బాగా సెట్ అయ్యారు. కామెడీతోపాటు థ్రిల్లర్ అంశాలు ఆద్యంతం ఆసక్తి కలిగిస్తాయి. త్వరలోనే హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. ఈ షెడ్యూల్లోనే పాటలతోపాటు మిగిలిన సన్నివేశాలను చిత్రీకరిస్తాం. క్వాలిటీగా సినిమా రావడానికి నిర్మాత బాగా సపోర్ట్ చేస్తున్నారు' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్ : ఏకరీ లక్కీ, పాటలు : బాషాశ్రీ, సమర్పణ: రమాదేవి, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : షెరాజ్.