Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్‌రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఎం.ఎల్.ఏ' (మంచి లక్షణాలు ఉన్న అబ్బారు). టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్.ఎల్.పి సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈచిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,' సంక్రాంతి నేపథ్యంలో విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం వినోదభరితం సాగే ఈచిత్రం హీరో కళ్యాణ్‌రామ్ కెరీర్లో ఓ మంచి చిత్రం అవుతుంది. నూతన దర్శకుడు ఉపేంద్ర ఈ చిత్రానికి ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. వేసవి హాలీడేస్ సందర్భంగా ఈచిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. 'టోటల్ న్యూలుక్‌తో ఎంతో స్టయిలీష్‌గా కళ్యాణ్‌రామ్ ఈ చిత్రంలో కనిపిస్తారు. కథ, కథనం, క్యారెక్టరైజేషన్స్ టైటిల్, క్యాప్షన్‌ను జస్టిఫై చేసేలా ఉంటాయి. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు' అని దర్శకుడు అన్నారు.