Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సూపర్ స్కెచ్'. ఏరోస్ సినిమాస్ సమర్పణలో శ్రీ శుక్ల క్రియేషన్స్ పతాకంపై బలరామ్ మక్కల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ, 'మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే స్క్రీన్‌ప్లే బేస్డ్ థ్రిల్లర్ చిత్రమిది. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఫారిన్ అమ్మాయి, నలుగురు క్రిమినల్స్ మధ్య కథ జరుగుతుంది. పోలీసును ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన క్రిమినల్స్ పాత్రలు ప్రధానంగా తెరకెక్కించాను. పోలీస్ ఆఫీసర్‌గా నర్సింగ్ నటించారు. ఆయన పాత్ర, డైలాగులు సినిమాకు మెయిన్ హైలైట్ అవుతాయి. శ్రీహరికి ప్రత్యామ్నాయం అనేలా నర్సింగ్ నటించారు. ఇంద్రసేన చేసిన నెగటివ్ పాత్ర కూడా సినిమాకు హైలైట్ అవుతుంది. ప్రతి సెకనూ ఏమవుతుందోనని ఉత్కంఠభరితంగా సాగేలా టైట్ స్క్రీన్‌ప్లేతో రూపొందించాను. ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయని విధంగా సాగే చిత్రమిది. హైదరాబాద్, విజయవాడ, బాపట్ల, సూర్య లంక బీచ్, వికారాబాద్ ఫారెస్ట్‌లో షూటింగ్ జరిపాం. 50 రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగంగా ఎడిటింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరులోగాని లేదా మార్చిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. నర్సింగ్, ఇంద్ర, సమీర్ దత్త, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, సోఫియా, గ్యారిటోన్ టోలన్, బంగార్రాజు, బాబా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, కెమెరా: సురేంద్ర రెడ్డి, ఎడిటింగ్: జునైద్.