Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమలాపురంలో సరదాగా తిరిగే గోపీ అనే కుర్రాడు ఓ పర్పస్ కోసం హైదరాబాద్‌కి వెళ్తాడు. అక్కడ అతను ఎదుర్కొన్న పరిణామాలేంటనేది తెలియాలంటే 'ఇగో' చిత్రాన్ని చూడాల్సిందే' అని అంటున్నారు హీరో ఆశిష్ రాజ్. సుబ్రమణ్యం దర్శకత్వంలో ఆశిష్‌రాజ్ హీరోగా నటించిన చిత్రం 'ఇగో'. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో ఆశిష్‌రాజ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ,'చిన్నప్పట్నుంచే నటనంటే ఇష్టం. 4వ తరగతి టైమ్‌లోనే నటించే ఛాన్స్ వచ్చింది. నాటకాల్లో రావణుడి పాత్ర వేశాను. పలు యాడ్స్ల్లోనూ నటించాను. అట్నుంచి సినిమాల వైపు వెళ్లాలని కలలు కన్నాను.
అవిప్పుడు నిజమయ్యాయి. మహేష్‌బాబుతో కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించా, కానీ అందులో నేను పెద్దగా కనిపించలేదు. అలాగే ఓ సినిమాలోనూ నటించా. అదీ రిలీజ్ కాలేదు. 'ఆకతాయి'తో హీరోగా పరిచయమయ్యాను. హీరోగా 'ఇగో' నాకు రెండవ చిత్రం. ఇద్దరు ఇగోయిష్టుల ప్రేమ కథ ఇది. ఇందులో నేను గోపీగా కనిపిస్తా. అమలాపురంలో కొంత మంది ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా, ఆడుతూ పాడుతూ గడిపేస్తుంటాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి చెందిన అమ్మాయి ఇందు(సిమ్రాన్) పరిచయమవుతుంది. మేం టీజింగ్ చేసుకుంటూ ఉంటుంటాం. ఓ టైమ్‌లో మా ఇగోలు దెబ్బతింటాయి. నీకంటే రిచ్ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటా అని ఆమె, నీకంటే అందమైన అమ్మాయిని నేనే చూసుకుంటా అని నేను.. ఇలా ఇద్దరం వాదించుకుంటాం. ఈక్రమంలో నేనొక సోషల్ కాజ్ కోసం హైదరాబాద్‌కి వెళ్తాను. అక్కడ చోటు చేసుకున్న ఓ ట్విస్ట్ వల్ల నా జీవితమే మారిపోతుంది. అదేంటనేదే సినిమా. పల్లెటూరు నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమా చేయడం వల్ల రైతుల మీద గౌరవం పెరిగింది. వాళ్ళు ఎంత కష్టపడతారో తెలిసింది. సినిమా కోసం ఆంధ్ర స్లాంగ్ కూడా నేర్చుకున్నాను. సుబ్రమణ్యం క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు. ఇందులో నేను స్మోక్ కూడా చేశాను. ఫ్యామిలీ అనుబంధం, విలేజ్ నేపథ్యం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. రొమాంటిక్ కామెడీ, ఇన్నోసెంట్ ప్లేవర్, సాయి కార్తీక్ పాటలు సినిమాకు హైలైట్ అవుతాయి. సినిమాలో కైరా దత్తో చేయించిన స్పెషల్ సాంగ్ హైలైట్‌గా నిలుస్తుంది. మాస్ ఆడియెన్స్‌ని ఈ సాంగ్ బాగా అలరిస్తుందని ఆశిస్తున్నాం. నిర్మాతలు మా మేన మామయ్యలు. రాజీపడకుండా నిర్మించారు. మేం అడిగిన దానికంటే ది బెస్ట్ ఇచ్చారు. అన్ని వర్గాలను అలరించే సినిమా ఇది. ప్రస్తుతం పలు కథలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ గురించి చెబుతాను' అని అన్నారు.