Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రియల్ లైఫ్‌లో ప్రతి మహిళా యుద్ధనారినే. కాకపోతే మా లోపల మేం యుద్ధం చేసుకుంటుంటాం. అది బయటి ప్రపంచానికి అంతగా తెలియదు' అని అంటోంది కంగనా రనౌత్. మహిళలకు సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో కంగనా స్పందిస్తుంది. ప్రస్తుతం ఝాన్సీ వీరనారి లక్ష్మీభాయి జీవితం ఆధారంగా రూపొందుతున్న 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా మహిళలు, వారిలో దాగున్న శక్తుల గురించి కంగనా మీడియాతో మాట్లాడుతూ, 'నాలో నేను ఓ వారియర్‌ను చూశాను. నాలోనూ యుద్ధం జరుగుతుంటుంది. కాకపోతే అది అంతగా ప్రసిద్ధి చెందదు. బయటకు కనిపించదు. నేనే కాదు ప్రతి మహిళా తాను నమ్మిన దాని కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. అది కోరికలే కావాల్సిన పనిలేదు. పలు ప్రొడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్లుగా యువ భారతీయ మహిళలు కావాలి. దానికి నా ఫేస్ పర్ఫెక్ట్ అని భావిస్తున్నాను' అని తెలిపింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది.