Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఆ విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, 'కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్. ఆయన నటిస్తున్న మరో భిన్నమైన చిత్రమిది. హృదయానికి హత్తుకునే ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వరుణ్ తేజ్ కొత్త పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన టీజర్, 'నిన్నిలా.. నిన్నిలా.. చూశానే..' అనే పాటకు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన లభిస్తుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 20న విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్.