Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా మొదటి తెలుగు సినిమాలో నన్ను చూపించిన విధానం నాకస్సలు అర్థం కాలేదు. అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది' అని అంటోంది ఇలియానా. 'దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా 'పోకిరి', 'జల్సా', 'కిక్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం నటించిన 'రైడ్' చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి చెబుతూ, 'దక్షిణాది చిత్రాల్లో హీరోయిన్ నాభినే ఎక్కువగా చూపిస్తారు. నేను నటించిన మొదటి సినిమా 'దేవదాసు'లో కూడా నా నడుము, నాభినే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకలా తీస్తున్నారని దర్శకుడిని అడితే, నేను చాలా అందంగా ఉన్నానని చెప్పారు. అప్పుడే కాదు ప్రతి సినిమాలోనూ అలానే చూపించారు. దీనికి నేను స్పందించి, మీకు నడుము చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండవచ్చు, స్త్రీని అందంగా చూపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పాను. అప్పుడే కాదు ఇప్పటికీ అలానే చూపిస్తున్నారు. మమ్మల్ని కేవలం గ్లామర్ డాల్స్లా చూపించడం బాధాకరం. బాలీవుడ్లో ఇలాంటి పరిస్థితిని నేనిప్పటి వరకు చూడలేదు' అని తెలిపింది.