Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం 'గులే బకావళి'. కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈచిత్రం తమిళనాట సంక్రాంతికి విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 23న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ, 'యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. తెలుగు నేటివిటికీ దగ్గరగా ఉంటుంది. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో సినిమా ఉంటుంది. పూర్తి ఎంటర్టైన్మెంట్గా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి' అని అన్నారు. రేవతి ముఖ్య పాత్రధారిణిగా మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్ఎస్ ఆనంద్ కుమార్, ఆర్ట్: కదీర్.