Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిఫరెంట్ పాత్రలకు, ప్రయోగాత్మక పాత్రలకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కేరాఫ్. ఆ విలక్షణతే ఆయనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణాన్ని పొందేలా చేసింది. ప్రస్తుతం 'జీరో' చిత్రంలో మరుగుజ్జుగా నటిస్తున్న షారూఖ్ త్వరలోనే వ్యోమగామిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అంతరిక్షంలోకి అడుగిడిన తొలి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాకేష్ శర్మ పాత్రలో తొలుత హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి పేర్లు వినిపించినప్పటికీ చివరిగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించనున్నారు. 'సెల్యూట్' పేరుతో రూపొందించబోయే ఈచిత్రంలోని వ్యోమగామి పాత్రకోసం తన ఆకృతిని మార్చుకునే పనిలో షారూఖ్ ఉన్నారని సమాచారం. సెప్టెంబర్‌లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సిద్ధార్థ్ రారు కపూర్ నిర్మించే ఈ చిత్రానికి దర్శకుడెవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. షారూఖ్ ప్రస్తుతం నటిస్తున్న 'జీరో'లో కత్రీనా కైఫ్, అనుష్క శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.