Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'రేస్' సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం 'రేస్ 3' రూపొందుతున్న విషయం విదితమే. సల్మాన్‌ఖాన్ హీరోగా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రెమో డిసౌజా తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్ర టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను గురువారం తన అభిమానులతో సల్మాన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'మరో 3 నెలల్లో ' అంటూ ట్వీట్ చేశారు. 'రేస్' ఫ్రాంచైజీలో సల్మాన్ తొలిసారిగా నటిస్తున్నారు. గత రెండు చిత్రాల్లో సైఫ్ అలీఖాన్ నటించారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం కోసం ఓ రొమాంటిక్ సాంగ్‌ను రాస్తూ లిరిసిస్ట్‌గా సల్మాన్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.
ఈ పాటను యుఏఈలో చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, డైజీ షా తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా జూన్ 15న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.