Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రజనీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆయనతో పోటీ అంటే చాలా కష్టమే' అని అంటున్నారు అమీర్ ఖాన్. ప్రస్తుతం అమీర్ నటిస్తున్న చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'. విజరు కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కత్రీనా కైఫ్, ఫాతిమా సనా షైఖ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
ఇదిలా ఉంటే, రజనీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా '2.0'. 'రోబో' తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. గ్రాఫిక్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 15 లేదా దీపావళికి విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. దీపావళికి వస్తే అటు అమీర్, ఇటు రజనీ సినిమాలు పోటీ పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై అమీర్ స్పందిస్తూ, 'రజనీకాంత్ పెద్ద స్టార్. ఆయనంటే నాకు చాలా గౌరవం, ఇష్టం. ఆయన నటిస్తున్న '2.0' మా సినిమాతోపాటు విడుదల కాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ ఇదే జరిగితే మాకు పెద్ద సమస్య ఎదురవుతుంది. చాలా కష్టమైపోతుంది' అని అన్నారు.