Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయిక శ్రియా రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొచ్చీవ్ను ఈ నెల 12న అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు మనోజ్ బాజ్పేరు, షబానా అజ్మీలు పెళ్ళికి హాజరైన వారిలో ఉన్నారట. అంతకు ముందు రోజు, మార్చి 11న పీ వెడ్డింగ్ వేడుక కూడా అత్యంత వైభవంగా జరిగిందని శ్రియా సన్నిహితులు చెబుతుంటే, హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. శ్రియా, ఆండ్రీ కొచ్చీవ్ పెళ్ళి చేసుకోబోతున్నారంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని శ్రియ తల్లితోపాటు శ్రియా కూడా ఖండించింది. ఈ నేపథ్యంలో తాజా పెళ్ళి వార్త అందర్నీ సర్ప్రైజ్ చేసింది. ఆమె అభిమానులందరూ స్వీట్ షాక్కు గురయ్యారు. ఇటీవల 'గాయత్రి'లో మెప్పించిన శ్రియా ప్రస్తుతం 'వీరభోగ వసంతరాయలు', 'నరగాసురన్', 'తడ్కా' చిత్రాల్లో నటిస్తోంది.