Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టచ్ చేసి చూడు' వంటి సూపర్‌హిట్ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తాజాగా 'నేల టిక్కెట్టు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని శనివారం చిత్ర ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా రవితేజ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ''క్లాస్, మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మే 24న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, కెమెరా: ముఖేష్.