Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ 'కేథార్నాథ్' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలవ్వక ముందే సారా అలీఖాన్ మరో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కి జోడీగా 'సింబా' చిత్రంలో నటించనుంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'టెంపర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. 'ఊహాగానాలకు తెరపడింది. రోహిత్ శెట్టి రూపొందించిందే 'సింబా' చిత్రంలో కథానాయికగా సారా అలీ ఖాన్‌ను ఫైనల్ చేశాం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని కరణ్ ట్వీట్ చేశారు. 'అద్భుతమైన ఫ్రెష్ ఫేస్, సూపర్‌స్టార్ ఎనర్జీ, పెద్ద ఫిల్మ్ మేకర్స్ కలిసి తీయబోతున్న ఈ సినిమా ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్' అని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. రోహిత్ శెట్టి, కరణ్ జోహర్ సంయుక్తంగా సినిమాను నిర్మించనున్నారు.