Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఇసాఖ్' చిత్రంతో బాలీవుడ్లోకి కథానాయికగా అడుగుపెట్టింది అమైరా దసూర్. ఆ తర్వాత 'అనేగన్' చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి, డెబ్యూ కథానాయికగా సైమా అవార్డునందుకుంది. అట్నుంచి 'కుంగ్ ఫూ యోగా' ఇంగ్లీష్ చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. ఇటీవల తెలుగులో 'మనసుకు నచ్చింది' చిత్రంతో మెప్పించిన అమైరా తాజాగా బాలీవుడ్లో ఓ బంపర్ ఆఫర్ను అందుకున్నట్టు తెలుస్తోంది. కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న 'మెంటల్ హై క్యా' చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం అమైరాను ఎంపిక చేశారట. ఏక్తా కపూర్ నిర్మించే ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి
దర్శకత్వం వహించడం విశేషం. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్ర పోస్టర్స్ ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. అమైరా ప్రస్తుతం 'రాజుగాడు', 'ఊడి ఊడి ఉజైకనుమ్' చిత్రాల్లో నటిస్తోంది.