Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం అభిమానులే. నా కెరీర్‌కి సంబంధించి ప్రతి అడుగులోనూ వారిది సముచిత పాత్ర ఉంది. అందుకే వారందరికీ మరింత చేరువగా ఉండాలని ఓ ప్రత్యేక యాప్ తయారు చేయించాను' అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.
ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను అనుసంధానం చేస్తూ ఉండే ఈ యాప్ గురించి రకుల్ చెబుతూ, 'ఇందులో నాకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ విశేషాలు, వివరాలు ఉంటాయి. అభిమానులతో లైవ్ ఛాట్ చేసేందుకు చాలా అనుకులంగా ఉంటుంది' అని తెలిపింది. రకుల్ ప్రస్తుతం సూర్య సరసన 'ఎన్జీకే', కార్తీతో ఓ సినిమా, శివకార్తికేయన్‌తో మరో సినిమా, హిందీలో అజరు దేవగణ్‌కి జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది.