Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'ఎంసిఏ' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన భూమిక తాజాగా రీమేక్ చిత్రంలో నటించబోతుందట. కన్నడలో విజయం సాధించిన 'యూ టర్న్' చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇందులో కీలక పాత్ర కోసం భూమికను ఎంపిక చేశారట. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగు, తమిళంలో కూడా 'యూ టర్న్' అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారట. నికేత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం రెగ్యుల్ షూటింగ్ ఇటీవల ఏపీలో ప్రారంభమైంది. భూమిక ప్రస్తుతం హిందీలో 'ఖామోషి', తెలుగులో 'సవ్యసాచి' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది.