Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫైట్ మాస్టర్ విజరు తనయుడు రాహుల్ విజరు హీరోగా నటిస్తున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'. కావ్యా థాపర్ కథానాయిక. రాము కొప్పుల దర్శకత్వంలో వి.ఎస్. క్రియేటీవ్ వర్క్స్ పతాకంపై దివ్యా విజరు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. సినిమా పెద్ద విజయం సాధించి, రాహుల్ హీరోగా రాణించాలన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ, 'లవ్, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. మా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన వరుణ్ తేజ్‌కి థ్యాంక్స్. ఫస్ట్‌లుక్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రాహుల్ విజరు సూపర్‌గా నటించాడు. దివ్యా విజరు మేకింగ్ పరంగా రాజీపడకుండా నిర్మించారు. మణిశర్మ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు పెద్ద అసెట్. ఇది అన్ని వర్గాలను అలరించే చిత్రమవుతుంది' అని అన్నారు. 'సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేశాం. అన్ని అంశాలతో దర్శకుడు రాము సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని నిర్మాత దివ్యా విజరు తెలిపారు. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేష్, సత్యం రాజేష్, జోష్ రవి, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.