Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బర్త్‌డే స్పెషల్స్‌గా హీరోలు తమ సినిమాలకు సంబంధించిన కొత్త వార్తలు, నయా లుక్స్‌ని రిలీజ్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. అందులో భాగంగా ఎన్టీఆర్ తన బర్త్‌డే స్పెషల్‌గా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే.
వీరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని 19వ తేదీ సాయంత్రం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గడంతోపాటు సిక్స్ ప్యాక్ కూడా చేశారని సమాచారం. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే భారీ మల్టీస్టారర్‌లో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించనున్నారు. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించి కూడా ఓ సర్ప్రైజ్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఒకేసారి రెండు చిత్రాలకు సంబంధించి నయా వార్తలు, లుక్స్‌తో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవ్వడం విశేషం.