Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, మాళవిక శర్మ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. ఈ చిత్ర ట్రైలర్ బుధవారం విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మాట్లాడుతూ, 'రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్, వెటకారపు డైలాగులు, మంచి ఎమోషన్ ఉంటుంది. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలుంటాయి. ఇప్పుడు నటించిన 'నేలటిక్కెట్టు' కూడా అలానే ఉండబోతుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఓ క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. మంచి కథా, కథనంతో సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే సినిమాలు తీసిన ఆయన ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. మాస్ హీరో, క్లాస్ దర్శకుడు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో తాజాగా ట్రైలర్ నిరూపించింది. 'ఫస్ట్ టైమ్ లైఫ్లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తుంది', 'చుట్టూ జనం మధ్యలో మనం.. అది కదరా లైఫ్', 'ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడు లేడు', 'ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం' లాంటి అద్భుతమైన అర్ధవంతమైన కళ్యాణ్ కృష్ణ మార్క్ క్లాస్ డైలాగులు ఒక వైపు, 'నువ్వు రావడం కాదు, నేనే వస్తున్నా.. ఇదే మూడ్ మెయిన్టైన్ చెరు', 'నేల టిక్కెట్టు గాళ్ళతో పెట్టుకుంటే, నేల నాకిం చేస్తారు' వంటి ఈలలు వేయించే రవితేజ మార్క్ మాస్ డైలాగులు మరోవైపు చూస్తుంటేనే ఇది క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్, ఇలా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా అని అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 25న గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపింది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, ఎడిటింగ్: బ్రహ్మకడలి.