Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేన్స్ అంతర్జాతీయ చలన చిత్ర వేడుకలు ఆద్యంతం కనువిందుగా సాగుతున్నాయి. ప్రతి రోజూ రెడ్ కార్పెట్‌పై తారలు చేసే సందడి, పలు చిత్రాల ప్రీమియర్ల హడావుడితో సాగే కేన్స్‌లో పదవరోజు మాత్రం ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. ప్రతి ఏడాది ఎయిడ్స్ బాధితుల సహాయార్థం ఫండ్ రైజింగ్ కోసం, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే నిమిత్తం నిర్వహించే 'యామ్ఫర్ గాలా' ఈవెంట్లో అధిక సంఖ్యలో తారలు పాల్గొని తమ సహృదయతను చూపారు. రెడ్ కార్పెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా తారలు ముస్తాబై యామ్ఫర్ గాలాలో హోయలు పోయారు. అంతేకాదు ఎయిడ్స్‌కు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో తమ విలువైన అభిప్రాయాలనూ పంచుకున్నారు.
డు క్యాప్ హోటెల్లో జరిగిన ఈ కార్యక్రమంలో హెడీ క్లమ్, టాం కౌలిత్జ్, పారిస్ హిల్టన్, మిచెల్ రోడ్రిగెజ్, విన్నీ హార్లో, సారా సంపాయో, జాసన్ డెర్లో, కరోలినా కుర్కోవా, హఫిట్ గోలన్, ఆండ్రియానా లిమా, ఫిలిప్ ప్లెయిన్, మోర్గాన్ ఓస్మన్, ఎల్లీ గౌల్డింగ్ తదితరులు పాల్గొని సందడి చేశారు. యామ్ఫర్ గాలా డిన్నర్ పార్టీలో పాల్గొని ఎంజారు చేశారు. ఇందులో ప్రధానంగా డాన్ కెటెన్, హైలీ క్లాసన్, అలెస్సాండ్రా అంబ్రోసియో, దర్శకుడు బెనిసియో డెల్ టోర్రో, 'జేమ్స్‌బాండ్' ఫేమ్ పియర్స్ బ్రాస్నన్, ఆయన భార్య కెలీ షారు స్మిత్, పెట్రా నెమ్కోవా, ఇసబెలి ఫోంటానా, లోరెనా రాయి తదితరులతోపాటు కాక్టెయిల్ పార్టీలో హీరోయిన్ క్రిస్టెన్ స్టీవార్ట్, నటుడు నికో రాబెర్గ్, ఆయన భార్య వివియన్ రోస్‌బర్గ్, లారా హారియర్, కోరీ హాకిన్స్, మిలా జోవోవిచ్, ఆడ్రియినె బ్రాడీ పాల్గొన్నారు. ఇక రెగ్యులర్ రెడ్ కార్పెట్‌లో 'నైఫ్ ప్లస్ హార్ట్', 'కఫెర్నమ్' చిత్రాల ప్రీమియర్‌లో కేట్ బ్లాంచెట్, వనెస్సా పారడైస్, క్రిస్టెన్ స్టీవార్ట్, మెలిటా టాస్కాన్, ఔరె అటికా, రోస్ బెర్ట్రమ్ వంటి నటీమణులు అందంగా తయారై ఎర్రతివాచీపై కనువిందు చేశారు. వీరితోపాటు నటీనటులు, దర్శకులు నడిన్ లాబాకి, జయిన్ ఆల్రాఫీయా, ఖలెడ్ మౌజానర్, నికోలస్ మౌరీ, యాన్న్ గోంజాలెజ్, వస్సిలీ స్క్నీదర్, నీల్స్ స్క్నీడర్, గ్యారీ ఓల్డ్మన్, యారానస్ పిషర్, లెబనీస్ నటుడు జైన్ ఆల్ రఫీ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందులో 'కఫెర్నమ్' చిత్ర ప్రీమియర్ సందర్భంగా కొందరు మ్యూజిషియన్స్ చేసిన సందడి ఆకట్టుకుంది.
ఇక తొమ్మిదో రోజు బాలీవుడ్ నటి అతిలోక సుందరి శ్రీదేవిని 'టైటాన్ రోజినాల్డ్ ఎఫ్ లెవిస్ ఫిల్మ్ ఐకాన్' అవార్డుతో గౌరవించిన విషయం విదితమే. ఈ అవార్డును బాలీవుడ్ అగ్ర నిర్మాత సుభాష్ ఘారు అందుకున్నారు. ఇదిలా ఉంటే 10వ రోజు 'మై ప్రొఫెషన్ ఈజ్ నాట్ బ్లాక్' చిత్ర ఫొటోకాల్లో ఫ్రెంచ్కు చెందిన షిర్లీ సౌజాన్న్, మాగజ్యాయా, సిల్బెర్ఫీల్డ్, ఫర్మైన్ రిచర్డ్, అస్సా సిల్లా, కరిజా టౌర్, ఔసా మాగా, సోనియా రోలాండ్, మేరీ ఫెలోమేన్ నగా, మైమౌనా గుయ్యే, ఫ్రాన్స్ జోబాడా, మాతా గబిన్, సారా మార్టిన్స్, సబైన్ పకోరా, నడేగే బ్యూసన్, డయాగే వంటి 16 మంది నలుపు కథానాయికలు, రచయితలు, ఫిల్మ్ మేకర్స్ ఫొటోలకు ఫోజులివ్వడంతోపాటు కేన్స్‌కే హైలైట్‌గా నిలిచారు. అందరూ కలిసికట్టుగా వచ్చి రెడ్ కార్పెట్‌పై కూడా హోయలు పోయారు. చిత్ర పరిశ్రమలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా వారంతా ఎర్రతివాచీపై నిరసన తెలిపారు. తమ శరీర రంగు కారణంగా సినిమాల్లో అవకాశాలివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.