Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందరికి నచ్చిన అంశాలుండటమే డిఫరెంట్ సినిమా. నేను ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి రాలేదు. అందరికీి నచ్చే సినిమాలే చేస్తాను' అని అంటున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న కళ్యాణ్ కృష్ణ తాజాగా రవితేజతో 'నేల టిక్కెట్టు' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ శనివారం మీడియాతో జరిపిన సంభాషణ
ఆయన మాటల్లోనే..
'నేల టిక్కెట్టు' టైటిల్ వింటే మాస్ మసాలా సినిమాలా అనిపించడం ఖాయం. అయితే ఫైట్స్ చేసే మాస్ కాదు. ఎక్కువ మంది మాస్ జనంతో రిలేట్ అయ్యే కథ. హీరో సరదా సరదాగా చేసే పనులను 420 అంటుంటారు. అందుకే టైటిల్లో 420 అని పెట్టాం. ట్రైలర్లో 'చుట్టూ జనం మధ్యలో మనం' అనే డైలాగ్ చెప్పించాం. సినిమా సోల్ అదే. అది కనెక్ట్ అయితే సినిమా కనెక్ట్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా ఆ డైలాగ్ గురించే మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వ్యక్తిగతంగా జనం మధ్యలో ఉండటాన్ని నేనెక్కువగా ఇష్టపడతాను. దాన్నే సినిమాగా తీశా. దీనికి ప్రత్యేకంగా స్ఫూర్తి అంటూ ఏం లేదు.
గత చిత్రాలు 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోరు వేడుక చూద్దాం'లోనూ ఫైట్సూ, పాటలున్నాయి. ఆ సినిమాల్లో ఉండే ఎమోషన్స్ ఇందులోనూ ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ సినిమా. ఫ్యామిలీ అందరికీ నచ్చే సినిమా కూడా. ఇటీవల సెన్సార్ సభ్యులు సినిమా చూసి చాలా మంచి సినిమా చూశామని అప్రిషియేట్ చేశారు. ఆ ప్రశంసే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. మేం అనుకున్నట్టుగానే సినిమా రావడంతో అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
ఊర్లో ఉన్నప్పుడు నేనెక్కువగా నేల టిక్కెట్టుతోనే సినిమాలు చూశాను. హైదరాబాద్ వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రతి సినిమాను తొలి ఆటను బాల్కానీలో, ఆ తర్వాత నేలటిక్కెట్టు కొనుక్కుని చూసేవాడిని. ఓ సినిమాని నేల టిక్కెట్టులో కూర్చుని చూస్తున్నప్పుడు పక్కనున్న ఒకామెని సినిమా ఎలా ఉందని అడిగితే, నాలుగైదు సార్లు నవ్వుకున్నాం. కొన్నిసార్లు ఏడ్చాం. మొత్తంగా సినిమా బాగుందని చెప్పింది. ఆమె సమాధానంలో నాకర్థమైంది ఒక్కటే సినిమా నచ్చిందా, నచ్చలేదా అనేదే చెబుతారు తప్ప వాళ్లు లాజిక్స్ పట్టించుకోరు.
ఇందులో రవితేజ ఆవారాగా తిరుగుతుంటాడు. అయినప్పటికీ జనం కావాలనుకుంటాడు. తన జీవిత గమనంలో ఎంత మందిని దగ్గరికి చేర్చుకున్నాడు?, ఎంత మందిని ఫ్యామిలీ చేసుకున్నాడనేదే సినిమా. బేసిక్‌గా రవితేజ అంటే కామెడీని బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ రేంజ్‌లోనే ఈచిత్రంలోనూ కామెడీ ఉంటుంది. రవితేజకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆయనలో కామెడీ, ఫైర్ రెండు కోణాలుంటాయి. 'విక్రమార్కుడు'లోని రెండు పాత్రలో అవి ప్రతిబింబిస్తాయి. మా చిత్రంలో కూడా ఆ రెండు కోణాలు, ఆ ఎమోషన్స్‌ను చూపించే ప్రయత్నం చేశాను.
'టచ్ చేసి చూడు' వంటి ఫెయిల్యూర్ తర్వాత రవితేజతో సినిమా ఏంటని ప్రశ్నించారు, దీనికి తగ్గట్టు స్క్రిప్ట్‌లోనూ మార్పులు చేయమని సూచించారు. రవితేజ కెరీర్లో ఎన్నో హిట్లు, బ్లాక్బస్టర్లున్నాయి. ఒక్క ఫెయిల్యూర్ని బట్టి మొత్తాన్ని జడ్జిమెంట్ చేయటం రాంగ్. అలాగే స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయటమనేది కూడా రాంగే. అందుకే ఆయనతో ఈ సినిమాని ఎటువంటి డౌట్ లేకుండా చేశాను. అంతేకాదు మా స్క్రిప్ట్ కంటెంట్ చాలా స్ట్రాంగ్. కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండానే సినిమా తీశాను.
రవితేజ మనుషులను నమ్ముతారు. ఒక్కసారి నమ్మితే వెనకా ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతారు. పని విషయంలో చాలా సిన్సియర్. ఓ రోజు మా చిత్రానికి సంబంధించి లాస్ట్ షాట్ కంప్లీట్ చేసుకుని గంటన్నరలో 'థేరి' రీమేక్ చిత్ర షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్ళిపోయారు. ఎవరైన నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని కొత్త సినిమా స్టార్ట్ చేద్దామనుకుంటారు. కానీ రవితేజ అలా అనుకోలేదు. ఆయన డెడికేటెడ్ వర్క్‌కి ఇదొక నిదర్శనం.
రవితేజ వల్ల మా సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా జరిగింది. ఆయన స్పీడుకు తగ్గట్టు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేశారు.
కెరీర్ ప్రారంభంలోనే పెద్ద హీరోలతో సినిమాలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మొదటి సినిమానే నాగార్జునగారితో చేయడం, రెండో సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్లోనే రావడం, చైతన్యతో తీయటం హ్యాపీగా ఉంది. మూడో సినిమా రవితేజతో చేయడం నా లక్. నాగార్జునతో పనిచేసినప్పుడు ఆయన తన అనుభవాల్ని పంచుకునేవారు, సలహాలిచ్చేవారు. చైతూ నా ఏజ్ గ్రూప్ కాబట్టి కొంచెం కంఫర్ట్‌గా ఉండేది. గత మూడేండ్లుగా రవితేజతో ట్రావెట్ అవుతున్నాను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను.
కమర్షియల్ అంశాల విషయంలో నాపై ఏ దర్శకుడి ప్రభావం లేదు. ఉన్నదంతా సినిమాల ప్రభావమే. అందరికి నచ్చేది కమర్షియల్ సినిమా అని నేను భావిస్తాను. చిన్నా, పెద్ద, మాస్, క్లాస్ ఇలా అందరికీ.. మొత్తంగా ఫ్యామిలీకి కనెక్ట్ కావాలని కోరుకుంటాను. నేను అనుకున్న కథను జనానికి అర్థమయ్యేలా చెబుతున్నామా? లేదా అనేది బాగా ఆలోచిస్తాను. ఈ విషయంలో సొంతంగా రాసుకున్న కథ అయితే మనకు నచ్చినట్టు తీస్తాం. అదే ఇతరుల కథ అయితే కనీసం పది శాతమైనా మిస్ అవుతాం.
ప్రయోగాత్మక చిత్రాలంటూ పెద్దగా ఏం లేవండి. 'రంగస్థలం' ఎక్స్పర్మెంటల్ చిత్రం కాదు. ఓ జోనర్‌కు చెందిన సినిమా. అలాగే 'మహానటి' ఓ కన్విక్షన్‌తో చేసిన చిత్రం. 'గరుడవేగ', 'భరత్ అనే నేను' ఎక్స్పర్మెంట్స్. అయినా నేను ప్రయోగాలు చేయడానికి లేను. సినిమా అనేది మనీతో ముడిపడిన అంశం. నిర్మాత సేఫ్‌గా ఉంటాడనుకుంటేనే ప్రయోగాలు చేస్తా. నా దృష్టిలో అందరికి కనెక్ట్ అయ్యే ప్రతి సినిమా డిఫరెంట్ చిత్రమే. నెక్ట్స్ బంగార్రాజు పాత్ర ప్రధానంగా సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా తర్వాత నాగార్జునగారిని కలుస్తాను. అన్ని కుదిరితే జూన్ లేదా జులైలో సినిమాని స్టార్ట్ చేస్తాం.