Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ హీరోహీరోయిన్లుగా కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్ తాత, లలిత కుమారి నిర్మిస్తున్న చిత్రం 'యురేక'. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత లలితా కుమారి మాట్లాడుతూ, 'కార్తీక్ ఆనంద్‌ను హీరోగా, దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రశాంత్‌తో కలిసి సినిమాను నిర్మించడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది' అని అన్నారు. 'జులై ఫస్ట్‌వీక్‌లో సినిమాను విడుదల చేస్తాం' అని మరో నిర్మాత ప్రశాంత్ చెప్పారు. దర్శకుడు కార్తీక్ ఆనంద్ చెబుతూ, 'సినిమాకు కథే బలం. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా, ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా సినిమా ఉంటుంది. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో జరిగే కథ ఇది. టెక్నికల్‌గా నాకు మంచి సపోర్ట్ లభించింది. 'యురేక' అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చే హ్యాపీనెస్. సినిమాలో ఆ కొత్త విషయమేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్' అని చెప్పారు. 'నాకిది రెండో చిత్రం. ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించడం హ్యాపీగా ఉంది' అని హీరోయిన్ డింపుల్ చెప్పారు.