Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్త్రీ, పురుషులకు సంబంధించి నేను సమాన హక్కులను కోరుకుంటాను. అలాగని స్త్రీవాదిని కాదు'
అని అంటున్నారు కరీనా కపూర్. నటిగా కొంత గ్యాప్ తర్వాత రీఎంట్రి ఇస్తూ ఆమె నటిస్తున్న చిత్రం 'వీర్ ది వెడ్డింగ్'. పట్టణ ప్రాంతంలోని నలుగురు మహిళలు పెళ్ళి పై బోల్డ్‌గా వ్యక్తం చేసే అభిప్రాయాలు ప్రధానంగా సాగే ఈ చిత్రంలో కరీనాతోపాటు సోనమ్ కపూర్, స్వర భాస్కర్, షిఖా తల్సానియా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర పాటల విడుదల కార్యక్రమం ఇటీవల ముంబయిలో జరిగింది. ఈ సందర్భంగా 'ఫెమినిజం' గురించి మీడియా అడిగిన ప్రశ్నకు కరీనా స్పందిస్తూ, 'నేను సమానత్వాన్ని నమ్ముతాను. మహిళా వాదినని చెప్పలేను. మహిళకు సంబంధించి అన్ని విషయాలు నాకు వర్తిస్తాయి. నేనొక హ్యూమన్ బీయింగ్‌ను. సైఫ్ అలీఖాన్‌కు భార్యనైనందుకు గర్వంగా ఉంది. నేనీ స్థానంలో ఉన్నందుకు చాలా హ్యాపీ' అని తెలిపారు. తన సినిమా గురించి చెబుతూ, 'ఇందులో నేను కమిట్మెంట్ ఫోబియాతో బాధపడుతున్న మహిళగా కనిపిస్తాను. మా నలుగురి పాత్రలు భిన్నమైనవి' అని చెప్పారు. ఈ చిత్రం జూన్ 1న విడుదలవుతోంది.