Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు లక్ష్మి తాజాగా నటిస్తున్న చిత్రం 'వైఫ్ ఆఫ్ రామ్'. విజరు యెలకంటి దర్శకత్వంలో కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కుతున్న చిత్రమిది. త్వరలో చిత్ర ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'కెరీర్ ప్రారంభం నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలు చేస్తున్న మంచు లక్ష్మి తాజాగా పూర్తి స్థాయి థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా మంచులక్ష్మి ఫస్ట్‌లుక్ విడుదల చేయడం జరిగింది. ఆమె పేరు దీక్ష. ఆమెకు ఓ సమస్య ఉందా! లేక ఆమే ఓ సమస్యా? అనే పాయింట్‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సినిమాను తెరకెక్కించాం. ఆమె జీవితంలో గుండెలు పగిలే సంఘటనలుంటాయి. ప్రతి దానికి భయపడుతుంటుంది. భయం అంటే తెలియనట్టు ప్రవర్తిస్తుంటుంది. న్యాయం కోసం చేసే పోరాటంలో ఆమె ఒకలా ఉండదు. ఎవరికీ తనపై అభిప్రాయం ఏర్పర్చుకునే అవకాశం ఇవ్వదు. ఇలాంటి పాత్రలు తెలుగులో ప్రేక్షకులకు కొత్త అనుభూతులను అందిస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 1న విడుదల చేయనున్నాం. సమాజాన్ని ప్రభావితం చేసిన మహిళల సమక్షంలో ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నాం. సినిమాను జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపింది.