Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు, వల్లభ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'తేజ్'. (ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. ''తొలిప్రేమ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రమిది. మంచి లవ్ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా రూపొందుతోంది. ప్యారిస్‌లో చిత్రీకరించిన రెండు పాటలతో టోటల్‌గా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని చిత్ర బృందం తెలియజేసింది. జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: సాహి సురేశ్, సంగీతం: గోపీ సుందర్.