Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ వైపు మహిళా ప్రధాన చిత్రాల్లో శక్తివంతమైన పాత్రలు చేస్తూనే
మరో వైపు గ్లామర్ రోల్స్ల్లోనూ సోనాక్షి సిన్మా నటిస్తూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. 'అకిరా', 'ఫోర్స్ 2', 'నూర్', 'ఇత్తేఫక్', 'వెల్కమ్ టు న్యూయార్క్' వంటి చిత్రాలే అందుకు నిదర్శనం.
తాజాగా అజరు దేవగన్‌కి జోడీగా నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అజరు దేవగన్ 'సడే సతి' చిత్రంలో నటిస్తున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న
ఈ చిత్రంలో నలుగురు హీరోలు నటిస్తున్నారు.
అందులో అజరు దేవగన్ ప్రధానంగా ఉన్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం సోనాక్షిని తీసుకోవాలనే యోచనలో ఆమెని అజరుదేవగన్ సంప్రదించారట. సోనాక్షితోపాటు ఇలియానా పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం సోనాక్షి వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అజరు, సోనాక్షి జంటగా గతంలో 'సన్ ఆఫ్ సర్దార్', 'యాక్షన్ జాక్ న్' చిత్రాల్లో నటించారు. ఈ చిత్రంతో ముచ్చటగా మూడోసారి జోడీ కట్టి హ్యాట్రిక్ హిట్ కొట్ట్టేందుకు సిద్ధమవుతున్నారు.
దీంతోపాటు సోనాక్షి ప్రస్తుతం 'హ్యాపి ఫిర్ భాగ్ జాయేగి', 'కళంక్'తోపాటు 'దబాంగ్ 3', నిఖిల్ అద్వానీ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తోంది. అలాగే సల్మాన్ నటిస్తున్న 'రేస్ 3'లోని
స్పెషల్ సాంగ్‌లోనూ మెరిసి ప్రేక్షకులను అలరించనుంది.