Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమర్, సంతోషి, శాలు, చౌరస్య ప్రధాన పాత్రధారులుగా చందిన రవికిషోర్ దర్శకత్వంలో ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిల్మ్స్ పతాకంపై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన చిత్రం 'అంతేర్వేదమ్'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు రవికిషోర్ మాట్లాడుతూ, 'మనిషి చనిపోయినప్పుడు, నిద్రపోతున్నప్పుడు, కోమాలో ఉన్నప్పుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది? ఆ మూడు దశల్లో శరీరం నుంచి బయటకు వెళ్ళిన ఆత్మలు ఎక్కడ కలుస్తాయి? మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి చనిపోయిన వారిని, మనకి తెలియని వారిని కలిసి వస్తుందా? దీనినే మనం 'కల' అనుకుంటున్నామా? ఇలాంటి విషయాలు అన్ని రాసి ఉన్న తాళపత్ర గ్రంథం పేరే 'అంతేర్వేదమ్'. ఆ తాళపత్ర గ్రంథం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమవుతోంది. జూన్ రెండవ వారంలో ట్రైలర్, ఆడియో రిలీజ్ చేయనున్నాం' అని అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ మహేష్, దొరబాబు, రవి, లడ్డు, యోగి తదితరులు నటించిన చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సంగీతం: జె.ఎస్.నిథిత్.