Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాట్ కొండూరును హీరోగా పరిచయం చేస్తూ లక్ష్మికాంత్ చెన్నా దర్శకత్వంలో ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రియాజ్ నిర్మిస్తున్న చిత్రం 'పరిచయం'. సామ్రాట్ కౌర్ కథానాయిక. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు లక్ష్మికాంత్ చెన్నా మాట్లాడుతూ,
'నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫస్ట్‌కాపీ చూసిన టీం అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రేమికుల హృదయానికి దగ్గరగా ఉండే చిత్రమిది. మంచి ఫీల్ ఉన్న ఎమోషనల్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నా' అని అన్నారు.
'మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది. నరేష్రానా సినిమాటోగ్రఫీ, శేఖర్‌చంద్ర సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతాయి.త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ నెలలో సినిమాను విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత రియాజ్ తెలిపారు. పరుచూరి వెంకటేశ్వర్రావు, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, సిజ్జు, శివ నారాయణ, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ: నరేష్ రానా, సంగీతం: శేఖర్ చంద్ర.