Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ హీరోహీరోయిన్లుగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'రాజుగాడు'. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన చిత్ర పాటలకు, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. రాజ్ తరుణ్‌తో 'ఈడో రకం ఆడో రకం', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', 'అంధగాడు' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మా బ్యానర్లోనే మరో సినిమా తీయడం ఆనందంగా ఉంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిలేరియస్ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. సినిమాకు గోపీసుందర్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది. త్వరలో ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించి జూన్ 1న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావు రమేష్, సిజ్జు, పృథ్వీ, కృష్ణభగవాన్, సుబ్బరాజు, రాజారవీంద్ర, ప్రవీణ్, సత్యా ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్, ఆర్ట్: కృష్ణమాయ.