Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా కాలం క్రితం సోనమ్ కపూర్ హీరోయిన్గా శశాంక్ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం
'ఎలైస్ ఇన్ వండర్లాండ్'ను ప్రారంభించారు. కొంత భాగం చిత్రీకరించారు. పలు కారణాల వల్ల
అది ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు దాన్ని పున:ప్రారంభించడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో సోనమ్ పాత్ర గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని, అన్నీ కుదిరితే త్వరలోనే సినిమాకి సంబంధించి మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు.
ఇదిలా ఉంటే సోనమ్ ప్రస్తుతం 'సంజు', 'ఎక్ లడ్కీ కో దేెఖా తో హైసా లగా' చిత్రాల్లో నటిస్తున్నారు.