Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహీధర్, సోనాక్షి సింగ్ రావత్ జంటగా శివగంగాధర్ దర్శకత్వంలో అశ్వని క్రియేషన్స్ పతాకంపై జి.లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం 'నా లవ్‌స్టోరీ'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మి మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. 'బొమ్మరిల్లు' లాంటి క్యూట్ లవ్ స్టోరీ ఇది. యూత్ అండ్ ఫ్యామిలీ చూడవలసిన చిత్రమిది. హీరోహీరోయిన్లు కొత్త వారైనా సీనియర్స్‌కి దీటుగా నటించారు. శివన్నారాయణ, తొటపల్లి మధు కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇందులోని రెండు పాటలు నార్త్ బ్యాంకాక్‌లోని చియాంగ్ మైలో షూట్ చేశాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'కాలేజ్‌లో అడుగుపెడుతున్న యూత్‌కి, ముఖ్యంగా ఆడపిల్లలకి, కొత్తగా ప్రేమలో పడేవాళ్ళకి, ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి ప్రేమపై క్లారిఫికేషన్ ఇచ్చే లవ్ స్టోరీ ఇది. 'అష్టాచమ్మా', 'ఉయ్యాల చంపాలా', 'పెళ్ళిచూపులు' లాంటి నేచురల్ లవ్ స్టోరీ. కొత్త వాళ్లైనా బాగా చేశారని సినిమా చూసి ప్రేక్షకులే చెప్తారు. ఇటీవల విడుదలైన ట్రైలర్స్‌కి, సాంగ్ ప్రోమోస్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రేమలో వచ్చే అవరోధాలను విభిన్నమైన కోణంలో చర్చించాం. సినిమా తప్పకుండా ఆదరణ పొందుతుందని నమ్ముతున్నా' అని దర్శకుడు శివగంగాధర్ అన్నారు.