Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాస్యనటుడు షకలక శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం 'శంభో శంకర'. కారుణ్య కథానాయిక. శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్.పిక్చర్స్ పతాకంపై వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న
ఈ చిత్రం గురించి నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. టీజర్ 50 లక్షల వ్యూస్‌ను పొందింది. స్టార్ హీరోల టీజర్‌కి దీటుగా వ్యూస్ వచ్చాయి. దిల్‌రాజు వంటి అగ్ర నిర్మాత ఈ చిత్ర టీజర్‌ను ప్రశంసించడం విశేషం. సినిమా బాగా వచ్చిందనడానికి నిదర్శనమిది. పరిశ్రమలో సినిమాపై పాజిటివ్ టాక్ వినిపించడం మాలో ఉత్సాహం నింపింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. 'శంకర్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నమిది. తొలి ప్రయత్నం సక్సెస్ సాధిస్తుందన్న ధీమా ఉంది. టీజర్‌తో వచ్చిన హైప్ దృష్ట్యా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. నటీనటులకు, టెక్నిషియన్లకు కీలక మలుపునిచ్చే చిత్రమవుతుంది' అని మరో నిర్మాత సురేష్ కొండేటి తెలిపారు.