Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలీవుడ్‌లో విజరు, ఎ.ఆర్.మురుగదాస్‌లది క్రేజీ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో వచ్చిన 'తుపాకి', 'కత్తి' చిత్రాలు సంచలన విజయం సాధించాయి. తాజాగా ఈ కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రానికి 'సర్కార్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. నేడు(శుక్రవారం) విజరు పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కళ్ల జోడు ధరించి, సిగరెట్ తాగుతూ మాస్‌లుక్‌లో గెడ్డంతో ఉన్న విజరు లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. దీనికి తగ్గట్టు 'సర్కార్' అనే శక్తివంతమైన టైటిల్ పెట్టడం సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచింది. విజరు నటిస్తున్న 62వ చిత్రమిది. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో విజరుకి జోడీగా కీర్తిసురేష్ నటిస్తున్నారు. దీపావళికి సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.