Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ మూవీ మేకర్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్'. 'ఐ లవ్ యు'
అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలోని 'నచ్చుతున్నాదే..' సాంగ్ ప్రోమోను గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలై ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. గోపీసుందర్ ఈ చిత్రంలోని అన్ని పాటలకు సూపర్‌హిట్ మ్యూజిక్ అందించారు. గురువారం సాయంత్రం రిలీజైన 'నచ్చుతున్నాదే..' సాంగ్ ప్రోమోకు రెస్పాన్స్ చాలా బాగుంది. కరుణాకరన్ మరోసారి ప్రేమ కథను అద్భుతంగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్టుగానే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కచ్చితంగా ఇది అన్ని వర్గాలను అలరిస్తుంది. జూలై 6న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.